Ticker

6/recent/ticker-posts

Ad Code

Vikram telugu movie Song release director Harichandan

                        Vikram Telugu Film First  lyrical Song  Realease

Vikram telugu movie first lyrical song launched by music director #koti gaaru 

On aditya music lable. click on link.....

 https://youtu.be/smBe4LYzZWQ 

         




 విక్రం  తెలుగు  మూవీ  (సాంగ్ లాంచ్ )


A brand india movie makers బ్యానర్ ద్వార నాగవర్మ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న విక్రం చిత్రంలో హీరోయిన్ దివ్య రావు నటిస్తున్నారు.హరిచందన్ దర్శకత్వం వహిస్తున్నాడు.సంగీతం సురేష్ ప్రసాద్ అందించాడు.ఈ చిత్రం లోని మొదటి పాట ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారి చేతుల మీదుగా లాంచ్ అవడం జరిగింది. 

ఈ సందర్బంగా కోటి గారు మాట్లాడుతూ ఈ విక్రం చిత్రం ద్వార మా ప్రియ శిష్యుడు సురేష్ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవడం చాల సంతోషంగా ఉంది .ఈ సినిమా లో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న నాగవర్మ గారికి సినిమా పట్ల ఉన్న ప్రేమ తెలుస్తుంది.విక్రం అనే రోల్ లుక్ బాగావుంది.ఈ సినిమాలోని కథ, పాటలన్నీ  నేను విన్నాను చాల బాగున్నాయి. ముఖ్యంగా దర్శకుడు హరిచందన్ చెప్పిన కథ నేటి యువతరానికి వారి ఆలోచన విధానానికి చాల దగ్గరగా ఉంటుంది.
సర్వమతసారం ఒక్కటే ప్రేమ...ప్రేమ లేని సమాజాన్ని  ఊహించలేము. అలాంటిది స్వచమైన ప్రేమకోసం నేటి యువత.. చిన్న చిన్న అఫార్ధలతో ఎంతో నమ్మకంగా మొదలుపెట్టిన వాళ్ళ జీవన ప్రయాణాలని కుడా మరచి విడిపోతున్నారు.వాళ్ళు ..తిరిగి తనని నమ్మినవాళ్ళ ప్రేమకి విలువనిచ్చి ..తిరిగి మరోసారి కలసే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నాకు చాల బాగా నచ్చింది .ఈ ఆలోచన వల్ల విడిపోయినవాళ్ళలో కొంతమంది అయిన కలుస్తారనే నమ్మకం తో హీరో ,దర్శకుడు ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. కథలో భాగమైన పాటలు చాల బాగున్నాయి నేను లాంచ్ చేసిన పాట “చుక్కలాంటి అమ్మాయి” ఈ పాటని సింగర్ పృథ్వీ చంద్ర పాడారు ,కోరియోగ్రఫీ సత్య మాస్టర్ చక్కగా చేసారు.ఈరోజు ఆదిత్య మ్యూజిక్ ద్వార విక్రం movie లోని మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ అయి యూత్ కి అలరిస్తుందని  ఆశిస్తూ..చిత్ర బృందానికి అభివందనాలు తెలియజేస్తున్నాను.  

చిత్ర హీరో నిర్మాత నాగవర్మ  మాట్లాడుతూ .. మా అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి

చేతుల మీదుగా మా విక్రం movie ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అవడం మాకు చాల సంతోషంగా 
ఉంది.సంగీతం సురేష్ ప్రసాద్ గారు బాగా చేసారు అలాగే మా కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ 
సాంగ్ ని బాగా చేపించాడు తను కూడా సాంగ్ లో నటించాడు.
ఓ సినిమా రైటర్ అన్ని తనేనని నమ్మి తనతో  ప్రేమలో పడితే..తను మాట మార్చగా 
సమాజంలోని కొన్ని కారణాలవల్ల విడిపోవాల్సివస్తే..వాళ్ళకికలిసే ఒక అవకాశం వస్తే  ఎలా  ఉంటుందనేదే మా కథ .  మా దర్శకుడు హరి చందన్ చెప్పిన కథ పాత్ర ని నమ్మి దానికోసం ఎంతో ఇష్టంగా కస్టపడి చేశాను సినిమాపూర్తి స్థాయి కమర్షల్ హంగులతో  చాల బాగావచ్చింది.
సాంగ్స్ అన్ని బాగావచ్చాయి ఈ రోజు రిలీజ్ అయిన సాంగ్ ని  యూత్ అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను.త్వరలోనే “విక్రం” సినిమాతో మీ ముందుకు వస్తాము.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ..”విక్రం “ సినిమాలో నాగవర్మ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నాడు.ఈ చిత్రానికి నేను దర్శకత్వం వహించాను.ఈ చిత్రంలోని మొదటి లిరికల్ సాంగ్ 
ని మా అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ కోటిగారి చేతులమీదుగా లాంచ్ అవడం చాల హ్యాపీగా ఫీల్ 
అవుతున్నాము. మ్యూజిక్ సురేష్ ప్రసాద్ గారు అన్ని పాటలకి నా కథకి తగ్గటుగా చక్కని బాణిలను అందించాడు  “చుక్కలాంటి పిల్లెవచ్చి “ సాంగ్ కి సత్య మాస్టర్ మంచి కోరియోగ్రఫీ ని ఇచ్చాడు .అలాగే మా వేణు మురళీధర్  ఈ సాంగ్ కి  అనుకున్న సమయంలో మంచి సినిమాటోగ్రాఫిని అందించాడు.   
మావిక్రం సినిమాలోని కథలోని పాయింట్ ని కోటిగారు చాల చక్కగా వివరించారు చాల మా విక్రం movie టీం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు.
.నేను చెప్పాలనుకున్న కథ. ఇద్దరు వ్యక్తుల మద్య  ఓ నమ్మకం తో పుట్టే ప్రేమ ..మరుపు అనే అబద్ధం తో దూరమైతే ..ఎన్నో హత్యలు ..ఆత్మ హత్యల నడుమ మిగిలి....విడిపోయి.. ఒంటరిగా మారిన వాళ్ళలో కొందరినైనా తిరిగి కలిసే ప్రయత్నం చేయాలన్నదే మాఉద్దేశం.మా విక్రం సినిమాలోని ప్రతి డైలాగ్ లు  వాస్తవానికి దగ్గరగా ఉంటాయి .మా ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ... విక్రం అనే సినిమాకి హీరో ప్రొడ్యూసర్ నాగవర్మగారికి థాంక్స్ 
అలాగే డైరెక్టర్ హరిచందన్ గారు కథకి తగ్గటుగా సాంగ్స్ చేయడానికి సహకరించారు .మ్యూజిక్ కి తగ్గట్టు డైరెక్టర్ గారు అద్భుతంగా సాంగ్స్ చిత్రీకరణ చేసారు.  
మా గురువుగారు కోటి గారి చేతుల మీదుగా నా మొదటి సినిమా.. మొదటి పాట  రిలీజ్ చేయడం  చాల సంతోషంగా ఉంది. సత్య మాస్టర్ గారి కోరియోగ్రఫీ బాగుంది 
హీరో నాగవర్మ గారు చాల అభిరుచితో చేసారు ఈ చిత్రం మాకు ఒక బ్రేక్ నివ్వాలని ఆశిస్తున్నాను .

హీరో : నాగవర్మ బైర్రాజు,  హీరోయిన్ : దివ్య రావు,

నటి, నటులు :  ఆదిత్య ఓం , సురేష్,ఖయ్యుం అలీ , సూర్య, పృథ్విరాజ్,తాగుబోతురమేష్,
  చిత్రం భాష , జయవాణి, జ్యోతి, ప్రీతీసింగ్,దేవిప్రియ,ఫిష్ వెంకట్,టార్జాన్ నర్సింగ్ యాదవ్ ,భూపాల్ రాజు ,వెంకటేష్ ,సుబ్రహ్మణ్యం   kvv పంతులు,చలపతిరాజు,వాసువర్మ.

సాంకేతిక నిపుణులు :

కథ,చిత్రానువాదం ,మాటలు దర్శకత్వం  : హరిచందన్ 
నిర్మాత : నాగవర్మ బై ర్రాజు  
సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్ వడనాల, ఆర్ట్ : బాబ్జి , సంగీతం : సురేష్ ప్రసాద్

కొరియోగ్రాఫీ : సత్య , రమేష్ కపిల్ , ఎడిటర్ :శ్రీను , స్టంట్ : శివరాజ్ 
pro : వినాయకరావు, కో డైరెక్టర్స్ : రమణ ,బద్రీనాథ్ వర్ధన్. పబ్లిసిటీ : కృష్ణప్రసాద్









Post a Comment

0 Comments