H ad

.card{ border-radius:20px; box-shadow:0 15px 35px rgba(0,0,0,.15); transition:.4s; } .card:hover{ transform:translateY(-10px); }

KVV Panthulu Biography | Telugu Film Actor Life Story, Career, Movies, Family & Unknown Facts | Hello1TV,Bioscope

 KVV Panthulu Biography | Telugu Film Actor Life Story,
Career, Movies, Family & Unknown Facts | Hello1TV Bioscope

Hello1tv

BIOSCOPE | కేవీవీ పంతులు – ఆరు దశాబ్దాల సినీ ప్రయాణం... అవకాశం కోసం మొదలైన అడుగు నుంచి 200కి పైగా చిత్రాల వరకు ప్రయాణం..

రచన: Hello1TV Bioscope

"సినిమా అంటే అభిమానం... నటన జీవితం..."

తెలుగు సినిమా చరిత్రలో స్టార్ హీరోల కథలు మాత్రమే కాదు... వందల చిత్రాలకు తమ ప్రతిభను అంకితం చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టుల కథలు కూడా అంతే గొప్పవి. అలాంటి కళాకారుల్లో ఒకరు కేవీవీ పంతులు. చిన్న పాత్రతో ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు రెండు వందలకు పైగా సినిమాలు,  టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌ల వరకు విస్తరించింది.

ఇది కేవలం ఒక నటుడి ప్రయాణం ... సినిమాపై ప్రేమ, సహనం, పట్టుదల, అవకాశాల కోసం ఎదురుచూపులు, కలలను వదలకుండా ముందుకు సాగిన ఒక సాధారణ మనిషి అసాధారణ కథ.

బాల్యం – తెనాలి నేల నుంచి సినీ కలల వరకు

కేవీవీ పంతులు గారి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రేపల్లె తాలూకా అడవుల దీవి గ్రామం.

తెనాలి అనగానే తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో దర్శకులు, నిర్మాతలు, నటులను అందించిన నేల గుర్తుకు వస్తుంది. ఆ సినీ వాతావరణం చిన్నప్పటి నుంచే ఆయనలో కళాప్రేమను పెంచింది.

ప్రాథమిక విద్యను అడవుల దీవిలో పూర్తి చేసి, హైస్కూల్‌ను తెనాలిలో అభ్యసించారు. అనంతరం విజయవాడలో డిప్లొమా విద్యను పూర్తి చేశారు.

రేలంగి గారే మొదటి ప్రేరణ

చిన్ననాటి నుంచే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలు చూసినా... ఆయన మనసును పూర్తిగా ఆకట్టుకున్న నటుడు మాత్రం హాస్య బ్రహ్మ రేలంగి వెంకట్రామయ్యఆయన తెరపై కనిపిస్తే సినిమా తప్పకుండా చూడాలనే ఉత్సాహం ఉండేదని కేవీవీ పంతులు గుర్తు చేసుకునేవారు.

నేటి యువత బ్రహ్మానందం గారిని ఎంతగా అభిమానిస్తుందో... తమ తరం సినీ ప్రేక్షకులకు రేలంగి గారంటే అంతే అభిమానమని ఆయన చెబుతారు.

అక్కడి నుంచే సినిమా నటన పై తన ప్రేమ మొదలైంది.

కుటుంబ పరిస్థితులు... కలలకు అడ్డుగా నిలిచిన రోజులు

సాంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఆయనకు సినిమా రంగంలోకి రావడం అంత సులభం కాదు.

ఆ రోజులలో సినిమాల్లోకి వెళ్లడం అంటే కుటుంబ సభ్యులు ప్రోత్సహించే పరిస్థితి ఉండేది కాదు.

అయినా మనసులోని కల మాత్రం ఎప్పుడూ చెరిగిపోలేదు .

చెన్నైలో మొదటి అవకాశం

ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్లిన సమయంలో ఒక మేనేజర్ ద్వారా సినిమా షూటింగ్‌కు వెళ్లే అవకాశం వచ్చింది.

అక్కడ క్లబ్ సాంగ్‌లో చిన్న పాత్ర చేయడం ఆయన జీవితంలో మొదటి సినీ అనుభవం.

తెరపై మాత్రమే చూసిన కెమెరా... సినీ దర్శకులు ప్రముఖులు

స్టూడియో...

లైట్స్...

నటీనటులు...

అన్నీ తన కళ్లముందు ప్రత్యక్షంగా కనిపించడంతో ఆ రోజు జీవితాంతం మరిచిపోలేని అనుభూతిగా నిలిచిపోయింది.

అదే ఆయన సినీ ప్రయాణానికి తొలి అడుగు. 

ఉద్యోగం... బాధ్యతలు ఉన్న ... కానీ సినిమా నటన పైన ప్రేమ మాత్రం తగ్గలేదు.

వివాహం తర్వాత ఉద్యోగ బాధ్యతలు పెరిగినా... వృతిరిత్య

చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఉద్యోగం చేస్తూనే సినిమా నటన పై ఆసక్తిని కొనసాగించారు.కుటుంబం తో సంతోషంగా గడిపారు .

1990 తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మళ్లీ పూర్తి స్థాయిలో మరోసారి సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

సీరియల్స్‌తో మొదలైన రెండో ఇన్నింగ్స్

రచయిత నడిమిటి నరసింహరావు పరిచయంతో దూరదర్శన్ సీరియల్‌లో అవకాశం లభించింది.

అక్కడి నుంచి ఒక్కొక్క అడుగుగా సినిమా అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.

Hello1tv

పనిచేసిన ప్రముఖ దర్శకులు

తన సినీ జీవితంలో ఆయన అనేక మంది దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేశారు.

వారిలో ముఖ్యంగా:

  • జంధ్యాల
  • బాపు
  • కోడి రామకృష్ణ
  • ముత్యాల సుబ్బయ్య
  • యండమూరి వీరేంద్రనాథ్
  • ఇంకా అనేక మంది ప్రముఖ దర్శకులు ఉన్నారు.

నటించిన ప్రముఖ చిత్రాలు

కేవీవీ పంతులు గారు నటించిన ముఖ్యమైన చిత్రాల్లో కొన్ని:

  • ఆపద్బాంధవుడు
  • ఎస్.పి. పరశురామ్
  • ప్రేమ జిందాబాద్
  • రక్షణ
  • అజాద్
  • గణేష్
  • కూలీ నంబర్ వన్
  • స్టూడెంట్ నంబర్ వన్
  • లెజెండ్
  • రూలర్
  • ముద్దుల మామయ్య
  • గబ్బర్ సింగ్
  • కాటమరాయుడు
  • తొలిప్రేమ
  • స్పైడర్
  • నారప్ప
  • సార్
  • గేమ్ చేంజర్
  • ఇంకా100కి పైగా  అనేక చిత్రాలు.

KVV గారు కలిసి నటించిన స్టార్ హీరోలు

దాదాపు తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని తరాల హీరోలతో ఆయన స్క్రీన్‌ను పంచుకున్నారు.

వారిలో:

ఇంకా అనేక మంది ప్రముఖ నటులతో కలిసి నటించారు.

వెబ్ సిరీస్‌లలోనూ అదే ఉత్సాహం

సినిమాలతో పాటు వందకు పైగా టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన ఆయన...

సుమారు యాభైకి పైగా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ కొత్త తరం ప్రేక్షకులకు చేరువయ్యారు.

ప్రభాస్‌తో మాత్రం చేయలేదు ఫౌజీ తో ఆ కల నెరవేరుతోంది.

తన సినీ జీవితంలో ఒక్క ప్రభాస్‌తో మాత్రమే కలిసి నటించే అవకాశం రాలేదని ఆయన చెబుతారు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న "ఫౌజీ" చిత్రంలో పాత్ర పోషిస్తూ ఆ కోరిక కూడా నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండువందలకు పైగా చిత్రాల మైలురాయి

చిన్న పాత్రతో మొదలైన ప్రయాణం...

నేడు రెండు వందలకు పైగా సినిమాలు...

వందలాది సీరియల్స్...

అనేక వెబ్ సిరీస్‌లు...

అనే అద్భుతమైన మైలురాయిని చేరుకుంది.

ఇష్టమైన పాత్రలు

కేవీవీ పంతులు గారు ముఖ్యంగా ఈ తరహా పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.

  • పూజారి
  • లాయర్
  • గ్రామ పెద్ద
  • ప్రభుత్వ అధికారి
  • కుటుంబ పెద్ద
  • వివిధ క్యారెక్టర్ రోల్స్

అయితే తాను కామెడీ పాత్రలు చేయడానికీ ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెబుతున్నారు. 

దర్శకులు, రచయితలకు విజ్ఞప్తి

"నా వయసు పెరిగినా నటనపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.

ఎలాంటి క్యారెక్టర్ అయినా పూర్తి నిబద్ధతతో చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

నా స్క్రీన్ ప్రెజెన్స్, నటన, పాత్రకు సరిపోతే నవ యువ దర్శకులు, రచయితలు తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను."

అని ఆయన వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నారు. 

సోషల్ మీడియా ద్వారా అందుబాటులో

తన తాజా ఫోటోలు, నటన వివరాలు, ప్రొఫైల్, వీడియోలు అన్నీ @KVVPanthulu పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ youTube వంటి సోషల్ మీడియా వేదికల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

 

ముగింపు

సినిమాపై ప్రేమ ఉన్నవారికి వయసు అడ్డంకి కాదు అనే విషయాన్ని కేవీవీ పంతులు గారి జీవితం నిరూపిస్తుంది.

అవకాశం ఆలస్యంగా వచ్చినా...

కలలు నిజం కావడానికి ఎన్నేళ్లు పట్టినా...

పట్టుదల ఉంటే సినీ ప్రయాణం ఆగదని ఆయన సినీ జీవితం సాక్ష్యంగా కనిపిస్తుంది .

Hello1TV "Bioscope" తరఫున కేవీవీ పంతులు గారికి అభినందనలు. మరెన్నో మంచి పాత్రలు, విజయాలు ఆయన సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

www.Hello1tv.com

  • KVV Panthulu Biography
  • Telugu Film Actor KVV Panthulu
  • Veteran Telugu Cinema Actor
  • KVV Panthulu Rare Photo
  • Hello1TV Bioscope Biography
  • Biography
  • Telugu Cinema
  • Film Industry
  • Actors
  • Movie Legends
  • Tollywood
  • Bioscope
  • Entertainment
  • Film History
  • Cinema Archive
  • #KVVPanthulu
  • #TeluguCinema
    #Tollywood
    #Biography
    #FilmHistory
    #ActorBiography
    #CinemaLegend
    #SouthIndianCinema
    #Hello1TV
    #Bioscope
    #MovieHistory
    #VintageCinema
    #TeluguMovies
    #Entertainment
    #ClassicCinema
  • KVV Panthulu complete biography
  • KVV Panthulu life story
  • KVV Panthulu family details
  • KVV Panthulu career journey
  • KVV Panthulu movies list
  • KVV Panthulu unknown facts
  • Telugu actor biography website
  • Telugu cinema legends biography
  • Tollywood veteran actor biography
  • South Indian cinema history
  • Hello1TV movie biography
  • Bioscope ,Celebrity,Film  Telugu articles

  • Post a Comment

    0 Comments